Wednesday, September 20, 2017

అమెజాన్ లో భారీ డిస్కౌంట్లుదసరా పండుగ సందర్బంగా అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. ఇవాళ  గ్రేట్ ఇండియా సేల్ ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఫెస్టివల్ లో కంపెనీ  భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈసారి ఫుడ్, గ్రోసరీలో  భారీ మెుత్తంలో డిస్కౌంట్లను  అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫుడ్, గ్రోసరీ లో భారీ ఆహరోత్పత్తులపై నేరుగా వినియోగాదారుకు 40 శాతం డిస్కౌంట్ ను ఇస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా బ్యూటీ ఉత్పత్తులపైన 35 శాతం, బేబి కేర్ లపైన 70 శాతం , పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50 శాతం  వరకు డిస్కౌంట్లను  అమెజాన్ ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కేటగిరి మేనేజ్ మెంట్ డైరెక్టర్ సౌరవ్ శ్రీవాత్సవ  తెలిపారు.