Wednesday, September 20, 2017

అమెజాన్ లో భారీ డిస్కౌంట్లుదసరా పండుగ సందర్బంగా అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. ఇవాళ  గ్రేట్ ఇండియా సేల్ ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఫెస్టివల్ లో కంపెనీ  భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈసారి ఫుడ్, గ్రోసరీలో  భారీ మెుత్తంలో డిస్కౌంట్లను  అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫుడ్, గ్రోసరీ లో భారీ ఆహరోత్పత్తులపై నేరుగా వినియోగాదారుకు 40 శాతం డిస్కౌంట్ ను ఇస్తున్నామని తెలిపింది. అంతేకాకుండా బ్యూటీ ఉత్పత్తులపైన 35 శాతం, బేబి కేర్ లపైన 70 శాతం , పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50 శాతం  వరకు డిస్కౌంట్లను  అమెజాన్ ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కేటగిరి మేనేజ్ మెంట్ డైరెక్టర్ సౌరవ్ శ్రీవాత్సవ  తెలిపారు.


Saturday, September 2, 2017

అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ టివి
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మితాషి అతి చవకైన స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. 32 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధర 22,990,

39 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధర 39,990 రూపాయలుగాను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. 


వీటిని ప్రత్యేక ఆఫర్‌ కింద అమెజాన్‌ 20,990 రూపాయలకు, 34,990 రూపాయలకు అందిస్తోంది. మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఫీచర్‌ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టం, కర్వ్‌డ్‌ స్ర్కీన్‌ డైనమిక్‌ కాంట్రాస్ట్‌, 1.1 గిగా హెడ్జ్‌ కోర్టేక్స్‌ ఏ7 ప్రాసెసర్‌, విత్‌ మాలి 400 ఇంటూ 2 జిపియు, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, మైక్రోఎస్‌డీకార్డు రీడర్‌ ద్వారా స్టోరేజ్‌ సామర్ధ్యం పెంచుకోవచ్చు.

Thursday, August 31, 2017

6జీబీ ర్యామ్‌తో అదిరిపోయే ఫోన్.. ధరెంతో తెలుసా?కూల్‌ప్యాడ్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కూల్ ప్లే 6 పేరుతో తన ఫ్లాగ్‌షిప్‌పై విడుదల చేసి ఈ ఫోన్ ధర రూ.14,999 మాత్రమే. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా వచ్చే నెల 4 నుంచి వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.


ఫీచర్లు: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, అవసరమైతే పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 7.1.1 ఓఎస్, డిసెంబరు తర్వాత ఆండ్రాయిడ్ 8.0తో అప్‌డేట్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో+నానో), 13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు. అయితే ఈ ఫోన్‌లో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌కు పెరుగుతుందని కూల్‌ప్యాడ్ తెలిపింది.

ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్లు ఇవే!రకరకాల ఫీచర్లతో రోజుకో మొబైల్ మార్కెట్లోకి విడుదలవుతోంది. అయితే ఎన్ని ఫోన్లు వచ్చినా వినియోగదారులు మాత్రం కొన్నంటే పడిచస్తారు. అటువంటి వాటిలో కొన్నింటిని స్ట్రాటజీ అనలిటిక్స్ తన నివేదికలో పొందుపరిచింది. దాని ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో కొన్ని..
ఆపిల్ ఐఫోన్ 7 ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయింది. మొత్తం 16.9 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో 4.7 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఈ ఫోన్ ధర రూ.56,200. దీని తర్వాతి స్థానంలో ఆపిల్‌కే చెందిన ఐఫోన్ 7 ప్లస్ నిలిచింది. 15.1 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. మార్కెట్ షేర్‌లో 4.2 శాతం చేజిక్కించుకుంది. ధర రూ.76,300. 


మూడో స్థానాన్ని శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 సొంతం చేసుకుంది. దీని ధర రూ.57,900. మొత్తం 10.2 ఫోన్లు అమ్ముడుపోగా 2.8 శాతం మార్కెట్ షేర్ సాధించింది. 


ఆ తర్వాత 9 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ నాలుగో స్థానంలో నిలిచి 2.5 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. 


ఇక ఇటీవల చైనాకు చెందిన మొబైల్ మేకర్ షావోమీ విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 4ఏ 5.5 మిలియన్ ఫోన్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీని ధర రూ.5.999.

మార్కెట్లో మోటో జి ఎస్‌, జి ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

మోటో జి సిరీస్‌లో మోటో జి ఎస్‌, మోటో జి ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను మోటోరోలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోటోరోలా మొబిలిటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధీన్‌ మాథూర్‌, ప్రొడక్ట్‌ హెడ్‌ అనుజ్‌ శర్మ ఈ ఫోన్లను విడుదల చేశారు. జి ఎస్‌ ప్లస్‌ ధర 15,999 రూపాయలుండగా, జి ఎస్‌ ధర 13,999 రూపాయలుగా ఉంది. బుధవారం నుంచి ఇ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌, మోటో హబ్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని మోటోరోలా వెల్లడించింది. జి ఎస్‌ ప్లస్‌, జి ఎస్‌ స్మార్ట్‌ఫోన్లతో మోటో జి పోర్టుఫోలియోను మరింతగా విస్తరించినట్లు తెలిపింది. పూర్తి మెటల్‌ బాడీతో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్లు కేవలం 15 నిమిషాల టర్బో పవర్‌ చార్జింగ్‌తో ఐదు గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని పేర్కొంది. మోటో జి5, జి5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లకు ఇవి పూర్తిగా అప్‌గ్రేడెడ్‌ మోడల్స్‌ అని తెలిపింది.


జిఎస్‌ ఫీచర్లు.,,
  • 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే
  • 1,4 గిగాహెట్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 4జిబి రామ్‌, 32 జిబి అంతర్గత మెమరీ
  • 16 మెగాపిక్సల్‌ హై రిజల్యూషన్‌ కెమెరా


జిఎస్‌ ప్లస్‌ ఫీచర్లు..
  • 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్‌, స్నాప్‌డ్రాగన్‌ 2.0 గిగాహెట్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 4జిబి రామ్‌, 64 జిబి అంతర్గత మెమరీ
  • రెండు 13 మెగాపిక్సల్‌ వెనుక కెమెరాలు, 8 ఎంపి ముందు కెమెరా
  • 3000 ఎంఎహెచ్‌ బ్యాటరీ