Thursday, August 31, 2017

మార్కెట్లో మోటో జి ఎస్‌, జి ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

మోటో జి సిరీస్‌లో మోటో జి ఎస్‌, మోటో జి ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను మోటోరోలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోటోరోలా మొబిలిటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధీన్‌ మాథూర్‌, ప్రొడక్ట్‌ హెడ్‌ అనుజ్‌ శర్మ ఈ ఫోన్లను విడుదల చేశారు. జి ఎస్‌ ప్లస్‌ ధర 15,999 రూపాయలుండగా, జి ఎస్‌ ధర 13,999 రూపాయలుగా ఉంది. బుధవారం నుంచి ఇ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌, మోటో హబ్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని మోటోరోలా వెల్లడించింది. జి ఎస్‌ ప్లస్‌, జి ఎస్‌ స్మార్ట్‌ఫోన్లతో మోటో జి పోర్టుఫోలియోను మరింతగా విస్తరించినట్లు తెలిపింది. పూర్తి మెటల్‌ బాడీతో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్లు కేవలం 15 నిమిషాల టర్బో పవర్‌ చార్జింగ్‌తో ఐదు గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని పేర్కొంది. మోటో జి5, జి5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లకు ఇవి పూర్తిగా అప్‌గ్రేడెడ్‌ మోడల్స్‌ అని తెలిపింది.


జిఎస్‌ ఫీచర్లు.,,
  • 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే
  • 1,4 గిగాహెట్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 4జిబి రామ్‌, 32 జిబి అంతర్గత మెమరీ
  • 16 మెగాపిక్సల్‌ హై రిజల్యూషన్‌ కెమెరా


జిఎస్‌ ప్లస్‌ ఫీచర్లు..
  • 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్‌, స్నాప్‌డ్రాగన్‌ 2.0 గిగాహెట్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 4జిబి రామ్‌, 64 జిబి అంతర్గత మెమరీ
  • రెండు 13 మెగాపిక్సల్‌ వెనుక కెమెరాలు, 8 ఎంపి ముందు కెమెరా
  • 3000 ఎంఎహెచ్‌ బ్యాటరీ