Thursday, August 31, 2017

ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్లు ఇవే!



రకరకాల ఫీచర్లతో రోజుకో మొబైల్ మార్కెట్లోకి విడుదలవుతోంది. అయితే ఎన్ని ఫోన్లు వచ్చినా వినియోగదారులు మాత్రం కొన్నంటే పడిచస్తారు. అటువంటి వాటిలో కొన్నింటిని స్ట్రాటజీ అనలిటిక్స్ తన నివేదికలో పొందుపరిచింది. దాని ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో కొన్ని..
ఆపిల్ ఐఫోన్ 7 ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయింది. మొత్తం 16.9 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో 4.7 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఈ ఫోన్ ధర రూ.56,200. 



దీని తర్వాతి స్థానంలో ఆపిల్‌కే చెందిన ఐఫోన్ 7 ప్లస్ నిలిచింది. 15.1 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. మార్కెట్ షేర్‌లో 4.2 శాతం చేజిక్కించుకుంది. ధర రూ.76,300. 


మూడో స్థానాన్ని శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 సొంతం చేసుకుంది. దీని ధర రూ.57,900. మొత్తం 10.2 ఫోన్లు అమ్ముడుపోగా 2.8 శాతం మార్కెట్ షేర్ సాధించింది. 


ఆ తర్వాత 9 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ నాలుగో స్థానంలో నిలిచి 2.5 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. 


ఇక ఇటీవల చైనాకు చెందిన మొబైల్ మేకర్ షావోమీ విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 4ఏ 5.5 మిలియన్ ఫోన్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీని ధర రూ.5.999.