Thursday, August 31, 2017

6జీబీ ర్యామ్‌తో అదిరిపోయే ఫోన్.. ధరెంతో తెలుసా?



కూల్‌ప్యాడ్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కూల్ ప్లే 6 పేరుతో తన ఫ్లాగ్‌షిప్‌పై విడుదల చేసి ఈ ఫోన్ ధర రూ.14,999 మాత్రమే. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా వచ్చే నెల 4 నుంచి వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.


ఫీచర్లు: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, అవసరమైతే పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 7.1.1 ఓఎస్, డిసెంబరు తర్వాత ఆండ్రాయిడ్ 8.0తో అప్‌డేట్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ (నానో+నానో), 13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు. అయితే ఈ ఫోన్‌లో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌కు పెరుగుతుందని కూల్‌ప్యాడ్ తెలిపింది.