Wednesday, August 30, 2017

రూ.4వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌!


చౌక ధరలకే ఫోన్లను అందించే ఇంటెక్స్‌ సంస్థ మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఆక్వా స్టైల్‌ 3’ పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.4,299గా కంపెనీ నిర్ణయించింది. 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌ ఓఎస్‌ను అందిస్తుండడం విశేషం. అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.




ప్రత్యేకతలు..
* 5 అంగుళాల తాకేతెర
* ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌ ఓఎస్‌
* 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
* 1 జీబీ ర్యామ్‌
* 16 జీబీ అంతర్గత స్టోరేజీ (64జీబీ వరకు పెంచుకునే వీలు)
* 5 ఎంపీ వెనక కెమెరా (ఫ్లాష్‌తో)
* 5 ఎంపీ ముందు కెమెరా
* 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ