ప్రభుదేవా, సోనూసూద్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోనవెంకట్ సమర్పకులు. సోమవారం ‘అభినేత్రి’ రెండో టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. కేవలం తమన్నా మాత్రమే కన్పించిన ఈ టీజర్‌ను చూస్తుంటే ఇందులోని నృత్యాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.