Thursday, July 28, 2016

తెలంగాణలో మొబైల్‌ ఫోన్లు మరింత చౌక

14.5 నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు


 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సెల్‌ఫోన్లు/మొబైల్‌ ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను ఐదు శాతానికి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకూ మొబైల్‌ ఫోన్లపై 14.5శాతం పన్ను వసూలుచేస్తుండగా ఐదు శాతానికి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు మొబైల్‌ ఫోన్లపై ఐదు శాతం పన్ను వసూలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధిక పన్ను అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో తాజాగా తగ్గించారు. తెలంగాణ వ్యాట్‌ చట్టం-2005లో షెడ్యూలు నాలుగులోకి మొబైల్‌ ఫోన్లను తీసుకువస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (వాణిజ్యపన్నులు) అజయ్‌ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

Source :- http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break39