Tuesday, June 26, 2012

Tapsee opposite balakrishna in Aditya 999



బాలకృష్ణ చిత్రంలో తాప్సీ 

'ఆదిత్య 369 ' ... బాలకృష్ణ - మోహిని జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా, ప్రేక్షకులకి ఓ సరికొత్త అనుభూతిని అందించింది. ఇప్పుడిదే సినిమాని బాలకృష్ణతో 'ఆదిత్య 999 ' పేరుతో సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథా పరంగా ఈ సినిమాకి ముగ్గురు కథానాయికలు అవసరం కావడంతో, ఆ దిశగా ఎంపిక కొనసాగుతోంది.
ప్రధాన కథానాయికగా అనుష్కను అనుకుంటే, డేట్స్ లేవనే సాకుతో ఆమె పక్కకి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మిగతా రెండు పాత్రల కోసం తాప్సీ ని ... అలనాటి కథానాయిక రజనినీ ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ప్రధాన కథానాయిక కోసం అన్వేషణ మాత్రం జరుగుతూనే ఉందట. గతంలో బాలకృష్ణతో 'సీతారామ కల్యాణం' వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన రజని, ఈ సినిమాలో అతని సరసన కనిపించడం ప్రధాన ఆకర్షణ అవుతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. తాప్సీకి కూడా ఇది చెప్పుకోదగిన చిత్రమౌతుందని అభిప్రాయపడుతున్నాయి.